ELR: కోర్టు మొనిటరింగ్ సెల్ ఏర్పాటుతో కేసుల పరిష్కారం వేగవంతమైందని ఏఎస్పీ నక్క సూర్యచంద్రరావు తెలిపారు. శనివారం ఏలూరులో ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 41 కేసుల్లో 51 మందికి శిక్షలు పడేలా కృషి చేసి, 156 శాతం వృద్ధి సాధించినందుకు సిబ్బందిని అభినందించారు. నిరంతర పర్యవేక్షణతో నేరస్థులకు తగిన శిక్షలు పడుతున్నాయన్నారు.