BHPL: జిల్లా మంజూరునగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భవానంద రెడ్డి – జ్యోతి దంపతులు స్వామివారి ఉత్సవమూర్తులకు ఇవాళ బంగారు కవచాలను విరాళంగా సమర్పించారు. ఆలయ ధర్మకర్తలు గండ్ర జ్యోతి- వెంకటరమణా రెడ్డి(మాజీ ఎమ్మెల్యే) వారిని సత్కరించారు. భక్తుల సేవాభావాన్ని కమిటీ అభినందించి, దాతల కుటుంబానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు.