HYD: నగరంలో రౌడీ షీటర్ల కదలికలపై హైదరాబాద్ పోలీసులు గట్టి నిఘా పెట్టినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఇటీవల జరుగుతున్న నేరాల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు సమాచారం రావడంతో నియంత్రణ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారు 1600 మంది రౌడీ షీటర్లను వివిధ పోలీస్ స్టేషన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారన్నారు. వారి కదలికలు, పరిచయాలపై నిరంతర గమనిక కొనసాగుతోందిని చెప్పారు.