కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు డిమాండ్ చేశారు. కాలయాపన చేయడం తగదని విమర్శించారు.