ATP: ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శనివారం పాత ఆర్డీవో కార్యాలయం వద్దనున్న గోడౌన్లను ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా లాగ్ బుక్కులు, భద్రతా చర్యలను పరిశీలించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.