కృష్ణా: మచిలీపట్నంలోని గిలకలదిండిలో రూ.30 లక్ష్యం వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజ్ అభివృద్ధి పనులకు మంత్రి కొల్లు రవీంద్ర శనివారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. రాబోయే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.