NLR: విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను నెల్లూరు జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న ఆప్కో స్థలాన్ని (6 ఎకరాలు 90 సెంట్లు) చేనేతలకు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తానని మాధవ్ హామీ ఇచ్చారు.