E.G: నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా శనివారం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. స్మార్ట్ ఫోన్ల పంపిణీ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మరింత పారదర్శకంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. అలాగే పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందించే పోషణ & ఆరోగ్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఉపయోగపడతాయన్నారు.