E.G: కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షతన శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని పట్టణ అభివృద్ధి, ప్రజలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. కొవ్వూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.