NZB: సిరికొండ మండలం నుంచి సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సదస్సుకు నేతలు హైదరాబాద్కు తరలివెళ్లారు. ఈ నేపథ్యంలోనే పి.రామకృష్ణ మాట్లాడుతూ.. కమ్యూనిజం వర్గరహిత సమాజానికి మార్గమని, శ్రమకు విలువ ఇచ్చే వ్యవస్థ అన్నారు. పెట్టుబడిదారులు కమ్యూనిజాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. సమసమాజ నిర్మాణానికి కష్టజీవులు పోరాడాలని పిలుపునిచ్చారు.