MLG: కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో సర్పంచ్ నిమ్మల శంకర్ ఆదేశానుసారం గ్రామ పంచాయతీ సిబ్బంది విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో గ్రామంలో ప్రతి వార్డుకు విద్యుత్ బల్బులతో పాటు సైడ్ డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నామని సర్పంచ్ తెలిపారు.