RR: మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్మించిన శివ శక్తి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఓం శాంతి సందేశంతో ఆధ్యాత్మిక చైతన్యం ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు.