MBNR: జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేట ప్రాంతానికి చెందిన మాజీ వార్డు సభ్యులు కాశీ విశ్వనాధ్ కుమారుడు ఇంటర్ చదువుతున్న ధనుష్ గుండెపోటుతో ఉస్మానియాలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. కుటుంబం ధైర్యంగా ఉండాలన్నారు.