BDK: చండ్రుగొండ గ్రామపంచాయతీ సర్పంచ్ రుక్మిణి, కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యార్డులో ఉన్న సమస్యలు గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నీటి సమస్య ఎక్కువ ఉందని ముఠా కూలీలు రైతులు సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.