BHPL: రేగొండ (M) కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను ఇవాళ MLA గండ్ర సత్యనారాయణ రావు, స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా MLA ఆలయ పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించి, వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. NSR ఛైర్మన్ సంపత్ రావు ఉన్నారు.