E.G: అనపర్తి AMC కార్యాలయంలో శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ, రైతు బజార్ అభివృద్ధిపై చర్చించారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.