యాషెస్ సిరీస్‌లో భాగంగా 4వ టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ తీవ్రంగా స్పందించాడు. ఇలాంటి పిచ్‌పై మ్యాచ్ నిర్వహించినందుకు ఆస్ట్రేలియాను కచ్చితంగా తప్పుపట్టాలని అన్నాడు. ‘భారత్‌లో ఇలా వికెట్లు పడితే అందరూ విమర్శలు గుప్పిస్తారు.. మరి ఇప్పుడు మెల్బోర్న్ పిచ్‌పై ఎందుకు స్పందించడం లేదు?’ అని ప్రశ్నించాడు.