E.G: పాట్ హోల్ ఫ్రీ సిటీగా నగరాన్ని తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులో జరుగుతున్న గుంతలు పూడ్చే పనులను నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. నగరంలో సుమారు 507 పాట్ హోల్స్‌ను దాదాపుగా పూడ్చి వేయడం జరుగుతోందన్నారు.