ATP: మత్స్యకారుల జీవనోపాధిని పెంపొందించే లక్ష్యంతో గుమ్మఘట్ట మండలంలోని భైరవాణి తిప్ప జలాశయంలో శనివారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు 10.50 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, చేపల ఉత్పత్తి పెరుగుదల వల్ల స్థానిక కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.