ADB: ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామంలో శనివారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా పర్యటించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఈ మేరకు ఉప సర్పంచ్ హర్షతాయి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ సమస్యలను వివరించారు. గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.