CTR: పుంగనూరు తాటిమాకులపాళ్యం విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ రకాల కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు ఈ శిబిరానికి రాగా శంకర్ నేత్రాలయ ఆసుపత్రి డాక్టర్ మురళీకృష్ణ పరీక్షలు నిర్వహించారు. అలాగే కంటి సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.