VZM: గజపతినగరం మండలం పురిటిపెంటలో నిర్వహించిన పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధికి దూరం చేసిందన్నారు. అలాగే ఇప్పటి వరకు జిల్లాలో రూ.500 కోట్లతో అభివృద్ది పనులను చేపట్టామన్నారు.