అక్రమంగా తమ దేశంలో ఉంటున్న భారతీయులను ఆయా దేశాలు తిరిగి స్వదేశానికి పంపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇలా 81 దేశాలు దాదాపు 24,600 మంది భారతీయులను వెనక్కి పంపించాయి. ఇందులో 11 వేల డిపోర్టేషన్స్తో సౌదీ అరేబియా టాప్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా దాదాపు 3,800 మందిని వెనక్కి పంపింది.