RR: షాద్నగర్ పట్టణంలో రాము అనే యువకుడు అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు. రోడ్డు విస్తరణ పనులు లేక ప్రజల ప్రాణాలు పోతున్నాయని, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే చౌరస్తాను విస్తరిస్తారని అధికారులను ప్రశ్నించాడు. వెంటనే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశాడు. కాగా, చౌరస్తాను విస్తరించండి మహాప్రభో అంటూ ఇటీవల పట్టణంలో ప్ల కార్డులతో నిరసనకు దిగిన విషయం తెలిసిందే.