KMM: మధిర మండలం చిలుకూరులో ఉన్న బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు ఎక్సైజ్ ఎస్సై జనార్దన్ రెడ్డిని కోరారు. శనివారం చిలుకూరు మహిళలు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్సైకు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెప్పారు. అటు ఆంధ్ర నుంచి కూడా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నారన్నారు.