BDK: మణుగూరు పట్టణంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ స్థాయి అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసే వారికి, ఇటీవల విజయం సాధించిన అభ్యర్థులు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గుణపాఠం చెప్పాలని ఆయన పేర్కొన్నారు.