NLG: అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆకాంక్షించారు. కట్టంగూర్లోని శ్రీ సాయి మణికంఠ దేవాలయం నందు శనివారం నిర్వహించిన షోడష (16వ) మహా పడిపూజ మహోత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములను, భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.