AP: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను PPP విధానంలోనే నిర్మిస్తామని మంత్రి డోలా శ్రీ బాలావీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. టెండర్లు వేయనీయకుండా కొన్ని సంస్థలను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మాజీ సీఎం జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా PPP విధానంలోనే కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.