BHNG: పడమటి సోమారం గ్రామంలోని లింగ బసవేశ్వర స్వామి దేవస్థానానికి ఎల్ఈడీ లైట్లను అందజేశారు. గ్రామానికి చెందిన ఆల్వ మాధవి ప్రభాకర్ రెడ్డి కుమారులు అజయ్ రెడ్డి, వినయ్ రెడ్డి 12 వేల రూపాయల విలువ గల ఐదు ఎల్ఈడీ లైట్లను ఛైర్మన్ సంధిగారి బస్వయ్య చేతుల మీదుగా దేవస్థానానికి అందించారు. ఈ కార్యక్రమంలో పూజరులు, తదితరులు పాల్గొన్నారు.