కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఈనెల 29న ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా మండల, మున్సిపల్, డివిజన్ కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ అర్జీల స్థితిని 1100 కాల్ సెంటర్, Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని ఆమె సూచించారు.