MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో చైనా మాంజాను వ్యాపారులు విక్రయించవద్దని జన్నారం అటవీ శాఖ ఎఫ్డీవో రామ్మోహన్ స్పష్టం చేశారు. శనివారం జన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చైనా మాంజాను విక్రయించకుండా చర్యలు చేపట్టామన్నారు. చైనా మాంజాతో గతంలో పలువురు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. పక్షులకు కూడా నష్టం వాటిల్లుతుందన్నారు.