AKP: సీపీఐ శత వార్షికోత్సవ వేడుకలను పాయకరావుపేట మండలం సత్యవరం, కుమారపురం గ్రామాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు జగ్గారావు మండల సమితి కార్యదర్శి వెలుగుల అర్జునరావు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.