JN: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో జనగామ జిల్లా ముందంజలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెండు విడతల్లో 5,834 ఇళ్లు మంజూరు కాగా, 5,206 ఇళ్లు నిర్మాణ దశలో, 33 ఇళ్లు పూర్తి అయ్యాయని చెప్పారు. వివిధ శాఖల అధికారుల భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.