కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలో ఈ నెల 29న నిర్వహించాల్సిన LLB ఐదవ, BALLB తొమ్మిదో సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 29న పలు అసోసియేషన్ ఎన్నికలు ఉన్నందున ఆ రోజు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశామన్నారు. ఆ పరీక్షలు నిర్వహించే తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ వీరబ్రహ్మచారి ప్రకటన విడుదల చేశారు.