AP: వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్ తనపై చేసిన ఆరోపణలపై మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ తప్పుబట్టారు. తాను దువ్వాడ జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తన గురించి దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కింజారపు అప్పన్నతో తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు. తనకు దువ్వాడ శ్రీనివాస్‌తో ఎలాంటి విబేధాలు లేవన్నారు.