హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ విషయంలో ఆమె విమర్శలు ఎదుర్కొంది. తాజాగా అనసూయ మరో పోస్ట్ పెట్టింది. ‘కొంతమంది రాబందులు, బాధ్యతలేని కొన్ని మీడియా సంస్థలు, సామాజిక అవగాహన లేని కొంతమంది స్మార్ట్ ఫోన్ల ద్వారా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారు’ అని పేర్కొంది.