KRNL: పెద్ద హరివాణం మండలంలో తమ 16 గ్రామాలను కలపవద్దంటూ సాగుతున్న పోరాటం ఉద్ధృతమైంది. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీ నేత గోపాల్‌రెడ్డి శనివారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆదోనిలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.