VZM: టీడీపీ పార్టీ ఇటీవల జిల్లా కమిటీలను ప్రకటించింది. ఈ సందర్భంగా జిల్లా కార్యనిర్వహక కార్యదర్శిగా ముల్లు రమాదేవి నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం గరివిడి మండలం కుమారాం సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. తనపై నమ్మకం ఉంచి పదవి అవకాశం కల్పించిన MLA కళా వెంకట్రావును శనివారం కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బోలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.