ధైర్యం, కరుణ, త్యాగాలకు గురు గోవింద్ సింగ్ ప్రతిరూపంగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. మానవుల మనుగడను కాపాడేందుకు, సత్యం, న్యాయం, ధర్మం వైపు నిలవడానికి గురుగోవింద్ జీవితం, బోధనలు ప్రేరణ కలిపిస్తాయని చెప్పారు. పదవ సిక్కు మత గురువు గురు గోబింద్ సింగ్ విజన్ ఇప్పటికీ అనేక మందిని సేవ, నిస్వార్థ కర్తవ్యం దిశగా నడుపుతుందని పేర్కొన్నారు.