జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతికి స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్ధివదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్య రంగంలో డా. శ్రీనివాస్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. అలాగే మాజీ జడ్పీ ఛైర్పర్సన్ వసంత శ్రీనివాస్ మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.