GDWL: అయిజ మండల కేంద్రం సమీపంలోని బింగిదొడ్డి పెద్ద చెరువు కట్ట కింద వెలసిన తిమ్మప్ప స్వామికి శనివారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కోనేరు జలాలతో స్వయంభు తిమ్మప్ప స్వామిని అభిషేకించి అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.