MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ ఉప సర్పంచ్ ఎం.ఎన్. ప్రసాద్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ప్రసాద్‌తో పాటు వార్డు సభ్యులు దొమ్మాట వెంకటేష్ గౌడ్, శివప్రసాద్, శశిధర్, సురేందర్, ఎ. రమేష్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.