TG: నీటి హక్కులను వాడుకోవడంలో సీఎంగా కేసీఆర్ ఫెయిల్ అయ్యారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నీళ్ల విషయంలో కేసీఆర్ అనేక తప్పిదాలు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికే పాలమూరుపై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నారని కామెంట్ చేశారు. పదేళ్ల పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.