SS: పుట్టపర్తి సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి సీ.అశోక్ కుమార్ ఆటోబాడీ రిపేర్ స్కిల్ పోటీల్లో ప్రతిభ చాటి గోల్డ్ మెడల్ సాధించారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో విజేతగా నిలిచిన అశోక్ కుమార్ను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు.