డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకొచ్చింది. HYD మాసబ్ ట్యాంక్లో ఈగల్ టీం చేసిన దాడుల్లో భారీగా కొకైన్, MDMA సీజ్ చేశారు. నితిన్ సింఘానియా, శ్రానిక్ సింఘ్వీ అనే పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి రెగ్యులర్ కస్టమర్ల లిస్టులో అమన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అమన్ పరారైనట్లు సమాచారం. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.