KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో BRS బలపడిందనే చర్చ నడుస్తుంది. పలు మేజర్ పంచాయితీల్లో ఆపార్టీ మద్దతుదారులు గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజార్టీ వచ్చిన అనేక గ్రామాల్లో బీఆర్ఎస్ పాగా వేసింది. మరోవైపు రెబల్ అభ్యర్థులకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.