SRPT: అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామ సర్పంచ్ జ్యోతి, శనివారం గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామంలోని మహనీయుల విగ్రహాలను శుభ్రం చేయించారు. ప్రజా సేవకు ప్రతీకలైన విగ్రహాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని, మహనీయుల స్ఫూర్తితో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె అన్నారు.