AP: వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులు ఆందోళన చెందొద్దని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని, ఆ పవిత్ర రోజుల్లో ఏ రోజు స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని పండితులు చెప్పారని పేర్కొన్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 90 శాతం సమయాన్ని సామన్య భక్తులకే కేటాయించామని వివరించారు.