BPT: కారంచేడు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైందని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని హరే రామ జప యజ్ఞ ఆశ్రమం ఎదురు ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున చెత్తాచెదారాలు పేరుకుపోయి దుర్గంధం వస్తుందని వారు వాపోతున్నారు. దోమల బెడద ఎక్కువైందని, అంటువ్యాధులు ప్రబలుతాయని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.