E.G: రాజమండ్రి పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడిగా ఎన్నికైన ముళ్ళపూడి దొరాజీ చౌదరిని దుద్దుకూరు టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. దేవరపల్లిలోని ఆయన నివాసంలో పీఏసీఎస్ ఛైర్మన్ కరుటూరి శ్రీరామమూర్తిలు, తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని, వారి సమస్యల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు.